రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేరుతో ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపిండు అని రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం…పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేరుతో కొత్త పాలసీ అంటూ భారీ కుంభకోణానికి రేవంత్ తెర లేపారు అన్నారు.
దేశంలో చరిత్రలో అతిపెద్ద ఐదు లక్షల కోట్ల రూపాయల భూములకు కుంభకోణం కాంగ్రెస్ పాల్పడుతోంది… హైదరాబాద్ నగరంలో ఉన్న 9,292 ఎకరాల భూమిపై రేవంత్ కన్నేశారు అన్నారు. కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఈ పాలసీ ద్వారా కుంభకోణం చేయబోతున్నారు అన్నారు.
గతంలో మా ప్రభుత్వం కనీసం 100% నుండి అత్యధికంగా 200% ఎస్ఆర్ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశిస్తే కాంగ్రెస్ కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అంటూ కొత్త పాలసీ తెచ్చింది… క్యాబినెట్ మీటింగ్‌లో ఈ భారీ స్కామ్‌కు తెరలేపింది అన్నారు. ఇప్పటికే ఈ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అనుచరులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు అన్నారు.
అందుకే ఆగమేఘాల మీద కేవలం ఏడు రోజుల్లో దరఖాస్తు, ఏడు రోజుల్లో ఆమోదం, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ హడావిడి చేస్తున్నారు… కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన హైదరాబాద్ పారిశ్రామిక భూముల ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు ఏటీఎం గా మారింది.. ఈ భూములు కొనుగోలు చేసిన, రెగ్యులరైజ్ చేసుకున్న పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అన్నారు.
Also Read:కార్తీక మాసం..యాదాద్రికి భారీ ఆదాయం
ప్రజల ఆస్తిని అప్పనంగా కొట్టేస్తామంటే కుదరదు… ఈ అంశంలో బిఆర్‌ఎస్ పార్టీ అవసరమైతే న్యాయపోరాటం చేస్తుంది అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లావాదేవీలన్నింటిపైన పూర్తి విచారణ ఉంటుంది, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం… కేవలం రేవంత్ రెడ్డి అవినీతి కోసం ఈ పాలసీలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులు పడవద్దని పారిశ్రామికవేత్తలకి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చేందుకు రూపొందించిన టి.ఎస్‌ఐపాస్ విధానాన్ని పారిశ్రామిక భూములు అమ్మేందుకు కాంగ్రెస్ వాడుతోంది అని ఆరోపించారు.

