కేసీఆర్ వెంట్రుకను కూడా సీఎం రేవంత్ రెడ్డి పీకలేడని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్‌కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రేవంత్ రెడ్డి కూలగొట్టడానికి వచ్చాడు తప్ప కట్టడానికి రాలేదు. విధ్వంసకరమైన ఆలోచనలతో పేదల ఇండ్లు కూలగొట్టడం, ప్రాజెక్టులను కూలగొట్టడం.. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు తప్ప ఈ సన్నాసికి ఏం చేతకాదు అని అర్థమైతుందన్నారు.
కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్‌ను విచారణకు పిలిచారంటే.. హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటిది అన్నారు. చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తది. తెలంగాణను సాధించిన నాయకుడిగా, సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతది అని కేటీఆర్ తెలిపారు.
ఈ చిల్లర రాజకీయాలను పట్టించుకోవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి. రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నిలబెట్టే రోజులు వస్తాయి అని దుయ్యబట్టారు.
Also Read:TTD:తెప్పపై పద్మావతి అమ్మవారు

