5లక్షలకు ఐస్‌క్రీం అమ్మిన కేటీఆర్‌..

257
- Advertisement -

సుచిత్ర సర్కిల్‌లో ఐస్‌క్రీం పార్లర్‌లో ఐస్‌క్రీం అమ్మిన మంత్రి కేటీఆర్‌. గులాబీ కూలి దీనలలో భాగంగా పలు శ్రమదాన కార్యక్రమాల్లో పాల్టొని తనే స్వయంగా జ్యూస్‌ తయారు చేసి అమ్మారు.అయితే ఇదంతా కొన్ని రోజులలో జరిగే ఆవిర్బావ దినోత్సవం కోసం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.మరి నిధులు సేకరించేందుకు కూలీ మారి తన వంతు శ్రమదానం చేశారు మంత్ర కేటీఆర్‌..

KTR sells ice cream

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు నిధులు సేకరించేందుకు మంత్రి కేటీఆర్ గులాబీ కూలీగా మారారు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ లోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో కూలి పని చేశారు. మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షల రూపాయలకు మంత్రి కేటీఆర్ ఐస్ క్రీం పార్లర్ లో ఐస్ క్రీం కొన్నారు. స్థానిక నేత కొలను శ్రీనివాసరెడ్డి కూడా లక్ష రూపాయలకు ఐస్ క్రీం కొన్నారు. ఆ తర్వాత జ్యూస్ తయారు చేసిన మంత్రి కేటీఆర్ 1.30 లక్షలకు సంగీత్ రెడ్డికి అమ్మారు. కాఫీ షాపులో లక్ష రూపాయలకు కాఫీ అమ్మారు. గులాబీ కూలి దినాల్లో భాగంగా పనిచేసిన మంత్రి కేటీఆర్ రూ. 8.30 లక్షలు సంపాదించారు.

- Advertisement -