ప్రజలతోనే..ప్రజల కోసమే పనిచేస్తాం!

4
- Advertisement -

ఎన్నికల ఫలితం వలన నిరాశ చెందము. మా పనిని ప్రధాన ప్రతిపక్షంగా చేసుకుంటూ పోతూనే ఉంటాం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలతోనే ఉంటాం. ప్రజల కోసమే ఉంటాము. ప్రజల్లోనే ఉంటాం. తిరిగి కెసిఆర్‌ని ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు.

గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన లగచర్ల నుంచి మొదలుకొని అనేక అరాచకాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూనే ఉన్నాము. ఇదే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేసుకొని ముందుకు వెళ్తాం అన్నారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ఎండబెడుతున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్‌కు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, పార్టీ నేతలు అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు.

ఈ ఎన్నికతో నిరాశ చెందవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారు…ఎన్నిక తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో నిమగ్నమై ముందుకు పోదాం అన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన మాదిరి ఇక్కడ కూడా పార్టీ మారిన నేతలను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వస్తాయి అని ఆశిస్తున్నాము…ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తాం…స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతాం అన్నారు.

ఈ ఎన్నిక సందర్భంగా మా పార్టీ సీనియర్ నేత హరీష్ రావు తండ్రి మరణం తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఇంటి నుంచి ఎన్నికల కోసం పనిచేశారు…మా పార్టీ ఎమ్మెల్సీ రవీందర్ రావు సోదరుడు చనిపోయిన తర్వాత కూడా ఒకే రోజులోనే పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు…దీపావళి లాంటి పండగను సైతం పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క పార్టీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్.

- Advertisement -