KTR:తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్ఎస్

30
- Advertisement -

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే ఓటేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్. తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌రాన్ని పార్ల‌మెంట్‌లో గ‌ట్టిగా, స్ప‌ష్టంగా వినిపించేది కేవ‌లం బీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మేన‌ని…అందుకే కేసీఆర్‌కే ఓటేయాలన్నారు.

2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్ర‌మే …2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమే అని స్ప‌ష్టం చేశారు. నాడు .. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం … తెలంగాణ దళం.. మనమే అని స్పష్టం చేశారు. దానికి ఉదాహ‌ర‌ణ.. 16, 17వ లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హ‌క్కులు, ప్ర‌యోనాల కోసం కేంద్రాన్ని నిల‌దీసిన సంద‌ర్భాన్ని గుర్తు చేశారు.

Also Read:మహిళల్లో సంతాన సమస్యలు తగ్గాలంటే..?

- Advertisement -