KTR:వినోదన్న గెలిస్తేనే కరీంనగర్ అభివృద్ధి

17
- Advertisement -

బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తేనే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హుజూరాబాద్‌లో రోడ్‌ షోలో మాట్లాడిన కేటీఆర్… పదేండ్ల నిజం కేసీఆర్‌ పాలన, పదేండ్ల విషం బీజేపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్‌ రెడ్డి పాలన మధ్య పోటీ అని తెలిపారు.

ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పిన నాయకుడు వినోద్‌ కుమార్‌ అని …అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప సంజయ్‌ ఒక్కపనైనా చేశారా అని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులు రాబట్టే సత్తా వినోద్‌కు ఉందని తెలిపారు. కేసీఆర్‌ పాలన ఎలా ఉంది.. కాంగ్రెస్‌ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు.

ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని…ఆరు గ్యారంటీల హామీ నెరవేర్చారా కాంగ్రెస్ నేతలు అని ప్రశ్నించారు. రూ.500 బోనస్‌ ఇస్తామన్న రేవంత్‌ హామీ ఏమైందని…రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా.. తులం బంగారం వచ్చిందా అని అడిగారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటేనే తెలంగాణకు రక్ష అని వినోద్‌ కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.

Also Read:వెన్నెల కిశోర్..OMG టీజర్

- Advertisement -