రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు.. ఒకరోజు కాలేశ్వరాన్ని…కూలేశ్వరం అంటాడు…. రేవంత్ రెడ్డికి భయంకరమైన మానసిక వ్యాధి ఉంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణలో భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక రుగ్మతతో ఉన్నాడు. అందుకే ఒకే అంశంపై ఆయన రోజుకోలా మాట్లాడతారు అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం తేలిపోయిందని, సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని చెప్పారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించింది అన్నారు.
పాలమూరు-రంగారెడ్డిపై ముఖ్యమంత్రి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. పాలమూరు-రంగారెడ్డిని వెంటనే పూర్తిచేసి మహబూబ్‌నగర్ ప్రజలకు సాగునీరు ఇవ్వాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. 580 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉండడం కరెక్టా?. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే, అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రమాదం జరిగితే ఒక్కసారి పోనీ రేవంత్ రెడ్డి అందాల పోటీలకు నాలుగు సార్లు పోయాడు. రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని చెప్పి, అందరూ దొంగల్లా చూస్తున్నారంటూ.. రూ.200 కోట్లు అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కరెక్టా? చెప్పాలన్నారు.
కాళేశ్వరంలోని రెండు పిల్లర్లకు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చేసింది?. మూడు నెలల తర్వాత కూడా అందులో చిక్కుకున్న వారిని బయటకు తీయలేకపోయారు. కమీషన్ల కోసం ఎస్ఎల్బీసీని హడావిడిగా మొదలుపెట్టారు అన్నారు.
Also Read:కేసీఆర్ కట్టిన సచివాలయం అద్భుతం:జగన్

