KTR:ఎలాంటి ఫామ్ హౌజ్‌లేదు

10
- Advertisement -

తనకు ఎలాంటి ఫామ్ హౌజ్ లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. బ‌ఫ‌ర్ జోన్‌లోని కానీ, ఎఫ్‌టీఎల్‌లో కానీ త‌న‌కంటూ ఎలాంటి ఫామ్‌ హౌజ్ లేదు అని స్పష్టం చేశారు.

మీడియాలో , కొంతమంది చెప్తున్న ఫామ్ హౌజ్ త‌న స్నేహితుడిది అని చెప్పారు. మంచి జ‌రుగుతున్న‌ప్పుడు అంద‌రం ఆహ్వానించాల్సిందే. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఒక్క‌టే అడుగుతున్నాను. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల‌లో మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ నేత‌లు క‌ట్టిన రాజ‌భ‌వ‌నాల సంగ‌తి ఏంది..? అని ప్రశ్నించారు. చెరువుల్లో కట్టుకున్న బడా కాంగ్రెస్ నాయకుల ఫామ్‌ హజ్‌లు కూలగొట్టే దమ్ము హైడ్రాకు లేదా..? అని ప్ర‌శ్నించారు.

హైడ్రానో.. అమీబానో ఉంది క‌దా.. దాని తీసుకొని అక్క‌డ్నుంచి నేరుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి మొద‌లు పెడుదాం. వాళ్ల త‌మ్ముడు కూడా అక్క‌డే ఉన్నాడు. అన్నీ ఒక్క‌టే రోజు కూల‌గొడుదాం.. ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌కంగా ఉందాం అని స్పష్టం చేశారు కేటీఆర్.

Also Read:Manu Bhaker: విద్యార్థులతో కలిసి మను బాకర్ డ్యాన్స్

- Advertisement -