KTR:రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు రెడీ!

4
- Advertisement -

రూ.50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన నీకు అన్నీ కుట్ర లాగానే కనిపిస్తాయి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుందన్నారు.

మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుందని…ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్న కుట్రలాగానే అనిపిస్తుందన్నారు. పేద గిరిజన రైతులకు అండగా నిలబడితే అది కుట్రగానే అనిపిస్తుంది …9 నెలలపాటు నీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసి, నీ బెదిరింపులన్ని తట్టుకొని, చివరికి ఎదిరిస్తే అది నీకు కుట్ర లాగానే అనిపిస్తుందన్నారు.

ప్రతినిత్యం భయంతో బతికే నీకు ఇవన్నీ కుట్ర లాగానే అనిపిస్తాయి…గొంతులేని వారికి గొంతుకు అయినందుకు…పేద రైతన్నల పక్షాన నిలబడినందుకు అరెస్టు చేస్తానంటే చేసుకో అన్నారు. తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి, తలెత్తుకొని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా అన్నారు.

Also Read:క్యూ లైన్‌ లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..!

- Advertisement -