‘కారు జోరు’ గ్యారంటీ !

30
- Advertisement -

రాబోయే పార్లమెంట్ కారు జోరు చూపిస్తుందని బి‌ఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో కే‌టి‌ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలే ఊహించలేదని అందుకే అడ్డగోలుగా హామీలు ప్రకటించి ఇప్పుడు వాటి అమలు కోసం తటపటాయిస్తున్నారని కే‌టి‌ఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సి‌ఎం అభ్యర్థి అని ముందే ప్రకటించి ఉంటే ఆ పార్టీకి 30 సీట్లు కూడా రావడం కష్టమయ్యేదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాకముందు అన్నీ హామీలు అందరికీ వర్తింపజేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అధికారంలోకి రాగానే కొందరికే అంటున్నారని కే‌టి‌ఆర్ మండిపడ్డారు. బి‌ఆర్‌ఎస్ హయంలో కరెంటు కోతలు అంటే ఏంటో ఎరుగని ప్రజలకు కాంగ్రెస్ కరెంటు కోతలను పరిచయం చేసిందని మార్పు అంటే ఇదేనా అంటూ వ్యాఖ్యానించారు.

రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, ప్రతి మహిళకు రూ.2500, పెన్షన్ రూ. 4000.. పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వాటిని ఎప్పుడు అమలు చేస్తారని కే‌టి‌ఆర్ ప్రశ్నించారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ రాష్ట్రానికి చేసిందేమి లేదని రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతున్నాయని కే‌టి‌ఆర్ చెప్పుకొచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటడం ఖాయమని, ఆ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి పూర్వవైభవం సాధిస్తామని కే‌టి‌ఆర్ అన్నారు. ఇక రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు గాను బి‌ఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికల్లో 9 సీట్లు సాధించింది. ఇక ప్రస్తుతం 10-15 సీట్లు సాధించేలా బి‌ఆర్‌ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. త్వరలోనే సీట్ల ప్రకటన కూడా వెలువడనుంది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read:సుందరం మాస్టర్ ప్రేక్షకుల విజయం..

- Advertisement -