కృష్ణా నదీ జలాల విషయంలో ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13న తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్’ కారణంగా అధికార పార్టీలో చలనం వచ్చిందన్నారు.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం ఇదేనని చెబుతూ.. ఈ ట్వీట్ కు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోను జత చేశారు.
ఛలో నల్గొండ ఎఫెక్ట్!
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
It’s… pic.twitter.com/0ysa6aUqFC
— KTR (@KTRBRS) February 12, 2024
Also Read:రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!