KTR:ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలి

37
- Advertisement -

నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్…కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు లేదు, నీళ్లు లేవు.. కన్నీళ్లే మిగిలాయన్నారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాన్నారు. .

రైతులు పండించిన ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షలు పరిహారం చెల్లించాలి…కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలి. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోవాలన్నారు.

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే…. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారన్నారు.

Also Read:Congress:కాంగ్రెస్ జన జాతర సభ

- Advertisement -