టీఎస్‌ ఐపాస్‌కు అభినందనల వెల్లువ…

205
KTR Rural Development Policy For IT Growth
- Advertisement -

శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై మంత్రి కేటీఆర్‌ ప్రసగించారు రాష్ట్రంలో సులభ వాణిజ్య వ్యాపార పద్ధతులలో టీఎస్ఐపాస్ ఒక విప్లవాత్మకమైన అడుగని కేటీఆర్‌ అన్నారు. కొత్తగా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించినట్లుగా ఆయన వెల్లడించారు. సులభ వాణిజ్యంతో పాటుగా రాబోయే రోజుల్లో కాస్ట్ ఆఫ్డూయింగ్‌ బిజినెస్, క్వాలిటి ఆఫ్డూయింగ్‌బిజినెస్‌ పై దృష్టిపెడుతామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ను అందరూ అభినందించారని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. శాసనమండలిలో టీఎస్‌ఐపాస్‌పై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు.

ktr

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. ఆపిల్ లాంటి దిగ్గజ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకుంది. ప్రపంచంలో టాప్ 5 సంస్థల్లో నాలుగు సంస్థలు తమ యూనిట్లను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నాయని తెలిపారు. 14 ప్రముఖ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. పుడ్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన తొలి రోజే మూడు యూనిట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలో ప్లాస్టిక్ సిటీని ఏర్పాటు చేస్తమని స్పష్టం చేశారు.

పరిశ్రమల ఏర్పాటుతో తెలంగాణ యువతకు ఉపాధి దొరుకుతుందని కేటీఆర్ అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం సుల్తాన్‌పూర్ ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేస్తమని తెలిపారు. నిజామాబాద్‌లో స్పైస్‌పార్క్ ఏర్పాటు చేస్తం. ఫార్మాసిటీ కోసం స్థల సేకరణ జరుగుతుంది. బోలక్‌పూర్‌లోని లెదర్ పరిశ్రమలను చెంగిచర్లకు తరలిస్తుమన్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక కాలుష్య రహితంగా హైదరాబాద్‌ను మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, యజమానులు పరిశ్రమల్లోనే ఉండే విధంగా కారిడార్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. నవంబర్ 2017లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -