జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభంకానుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సోమాజిగూడ రోడ్ షోలో మాట్లాడిన కేటీఆర్.. మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయింది.. మెజార్టీ మాత్రమే తేలాలి… జూబ్లీహిల్స్ మరోసారి గత ఎన్నికల రిజల్టే రాబోతోంది అన్నారు. అందరికి అన్నం పెట్టే నగరం హైదరాబాద్… కులం, మతం, ప్రాంతం ఎవరినైనా కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్ అన్నారు.
ప్రతి ఇంట్లో, షాపులో ఇన్వర్టర్లు పెట్టుకునే పరిస్థితి ఉండేది… సమ్మర్ వచ్చిందంటే తాగునీటికి కటకట ఉండేది… కేసీఆర్ సీఎం అయిన తర్వాత.. రాష్ట్రాన్ని చంటిబిడ్డలా చూసుకొని బాగు చేసుకున్నారు… ఇన్వర్టర్‌లు, జనరేటర్‌లు మాయమయ్యాయి.. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం అన్నారు. తాగునీటి సమస్య తీర్చాం… కొత్త పాలసీలు తీసుకొచ్చి ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ వంటి ఎన్నో పాలసీలు తీసుకొచ్చాం అన్నారు.
3 లక్షల ఐటీ ఉద్యోగులను 10 లక్షలకు తీసుకెళ్లాం…రియల్ ఎస్టేట్ పెరిగింది.. వాటితో పాటు ఇతర వ్యాపారాలు పెరిగాయి…ఓలా, ఉబర్, జొమాటో, గిగ్ వర్కర్లు ఎలా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాం…శాంతి భద్రతలు కాపాడి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం…కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో, సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు…ఇమామ్‌లను, పూజారులను, పాస్టర్లు.. ఇలా సబ్బండ వర్ణాలను మోసం చేశారు అన్నారు.
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చారు… కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చిందో గుర్తు చేసుకోవాలి… అత్తలకు రూ.4 వేలు, కోడళ్లకు రూ.2500, వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ అన్నారు….తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు…యువతులకు స్కూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు….రైతన్నలకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు…రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు అన్నారు..మైనార్టీలకు రూ.4వేల కోట్ల బడ్జెట్ అన్నారు, సబ్ ప్లాన్ అన్నారు.. ఒక్కటి కూడా అమలు చేయలేదు…ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గాన్ని ఇలా అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది… దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామన్నారు…కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని రాహుల్ గాంధీ చెబితే పాపం విద్యార్థులు నమ్మారు అన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలన బాగుండెనా.. రెండేళ్ల రేవంత్ పాలన బాగుందో మీరే తీర్పు చెప్పాలి…నిష్పక్షపాతంగా కొట్లాడితే ఓడిపోవడం ఖాయమని రేవంత్‌కు అర్థమైంది…అందుకే దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు…ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి…ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి…మళ్లీ కేసీఆర్ రావాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర స్టార్ట్ కావాలి అన్నారు.
Also Read:నిద్ర లేమి..మెదడుపై భారం!

