కుల,మతాలతో సంబంధం లేకుండా తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన కేటీఆర్ రానున్న ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే అని తెలిపారు.
నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడని తెలిపారు. ఆసరా పెన్షన్లతో వృద్ధులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిలో 43 పైసలు సంక్షేమానికి ఉపయోగిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ బియ్యానికి కూడా కోత పెట్టిందని మంత్రి మండిపడ్డారు.
కూటమికి ఒక్క ఓటు వేసినా చంద్రబాబు వేసినట్టే అని, ఎంఎల్ఎలను కొనేందుకు ప్రయత్నించి దొరికిన దొంగ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పెన్షన్లు రెట్టింపు చేయడంతో పాటు రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మంచకుండా బాబు కేంద్రానికి 30 లేఖలు రాసిండని దుయ్యబట్టారు. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.