టి పైబర్ ప్రాజెక్టు పై కేటీఆర్ రివ్యూ..

85
Ktr reviews T-Fibre project

ముఖ్యమంత్రి అలోచనల మేరకు 2018 నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టన టీ పైబర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్..మిషన్ భగీరథతోపాటు సమాంతరంగా టి పైబర్ పనులు పూర్తి చేయ్యాలని కోరారు. ఇప్పటిదాక టి ఫైబర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో కలసి సమన్వయంలో టి పైబర్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం వేస్తున్న పైప్ లైన్‌ అన్నీంటితోపాటు పైబర్ డక్ట్ వేస్తున్నట్లు, అలా వేస్తేనే అయా పైప్ లైన్లకు బిల్లులు చెల్లిస్తామని అర్‌డబ్యూయస్ శాఖ పెట్టిన నిబంధనతో పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. టి ఫైబర్ కు నిధుల కొరత లేదని కేంద్ర , రాష్ర్ట ప్రభుత్వాల సహకారం అందుతుందని తెలిపారు. పైబర్ డక్ట్ ను వేస్తున్న తీరుగానే పైబర్ కేబుల్ వేసే పనులను కూడ ప్రస్తుతం పనులు చేస్తున్న వర్కింగ్ ఏజెన్సీలతోనే పూర్తి చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ఐటి శాఖ అధికారులకు అదేశాలిచ్చారు. అవసరం అయితే సాంకేతిక సహాకారం అందించాలన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులకు టి పైబర్ గ్రిడ్ పైన పూర్తి స్ధాయి నివేదికను అందించనున్నట్లు అధికారులు మంత్రి తెలిపారు.

 Ktr reviews T-Fibre project

టిపైబర్ ప్రాజెక్టుతో పాటు టి వర్క్(t-works) పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిశోధనలకు, స్టార్ట్ అప్స్ కోసం టి హబ్ ఏర్పాటు చేసినట్లే ఏలక్ర్టానిక్స్, హర్డ్ వేర్ పరిశోధనల కోసం టి వర్స్క్ ను ప్రారంభిస్తామని, దీంతో నగరంలో హర్డ్ వేర్ పరిశోధనలకు, అలోచనలకు ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే వర్క్ ప్రారంభించేందుకు నగరంలోని 12 ప్రాంతాలను పరిశీలన చేసినట్లు, ఒకటి రెండు వారాల్లో టి వర్క్క్ ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 Ktr reviews T-Fibre project