ఎస్ఆర్‌డీపీ పనులపై కేటీఆర్‌ సమీక్ష

204
KTR Review SRDP works
- Advertisement -

ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిపైన మంత్రి కెటి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. బేగంపేట కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో ట్రాన్స్ కో, జలమండలి, సిపిడిసియల్, జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయం సమావేశంలో కేటీఆర్  ఎస్‌ఆర్‌డీపీ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనుల కోసం తరలించనున్న విద్యుత్, వాటర్ వర్స్ లైన్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అన్న మంత్రి, దీని పనులను వేగంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ముఖ్యంగా శాఖల మద్య సమన్వయానికి ఇలాంటి సమావేశాలు తరచుగా నిర్వహించాని, ఎదైన సమస్యలుంటే తనకు నేరుగా తెలియపరచాలన్నారు. అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు సాగితేనే పనులు వేగవంతం అవవుతాయన్నారు.

జలమండలి, విద్యుత్ శాఖల లైన్ల తరలింపు పనులకు సాద్యమైనంత త్వరగా చేసేందుకు టెండర్ గడువు తగ్గించాలన్నారు. శాఖల మద్య అర్ధిక పరమైన లావాదేవిలు( తరలింపు, రోడ్డు రిస్టోరేషన్ పనులు ఫీజులు) పూర్తి అయ్యేదాకా పనులు అపకుండా వేంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఎస్సార్డీపి పనులకు అవవసరం అయిన భూసేకరణ సమన్యలపైన మంత్రి, జిల్లా కలెకర్లు, రెవెన్యూ యంత్రాంగంతో మంత్రి ఫోన్లలో మాట్లాడారు. ఎస్సార్డీపి భాగంగా కామినేని, యల్ బి నగర్, బయోడైవర్సీటి పార్కు, చింతల కుంట, దుర్గం చెరువు వంటి ప్రాంతాల్లో చేపట్టిన పనులపైన ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

- Advertisement -