సిరిసిల్లా అభివృద్దిలో రాజీపడొద్దు

227
KTR review on Siricilla district development
KTR review on Siricilla district development
- Advertisement -

సిరిసిల్లా జిల్లా అభివృద్ది కార్యక్రమాల మీద మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్ధాయి అధికారులు పాల్గోన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాల మీద రోజు వారీ పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ కు అదేశాలు జారీ చేశారు. సిరిసిల్లా నియోజక వర్గానికి చెందిన మంజూరైన కార్యక్రమాల అమలులో వెనకపడిన పంచాయితీరాజ్, అర్ అండ్ బీ శాఖల పనితీరుపైన మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు పనులు మెల్లిగా చేస్తే సహించవద్దని, ఒప్పందంలో పెర్కోన్న విధంగా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయించాలన్నారు.

సమయ పాలన, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదన్నారు. అగస్టు 15 నాటికి సిరిసిల్లా పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. అర్ అండ్ బి, అర్భన్ మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ శాఖల మద్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. సిరిసిల్లా పట్టణం మాదిరే అన్ని మండల కేంద్రాల్లో ఏల్ ఈ డీ లైట్ల భిగింపు ప్రారంభించాలన్నారు. మరోపైపు తాను దత్తత తీసుకున్న గ్రామాలపైన ప్రత్యేక శ్రద్ద వహించి అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాలన్నారు. వీటితోపాటు అన్ని గ్రామాల్లో ప్రాథమిక మౌళిక వసతులు కల్పనకు ప్రాధన్యాత ఇవ్వాలని అదేశించారు. మెత్తం జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత వేగంగా పనిచేయించాలని కలెక్టర్ ను కోరారు. సిరిసిల్లా జిల్లా రోడ్డు అట్లాస్ ఏర్పాటు చేయాలని, దీంట్లో అన్ని జనావాసాలకు ఉన్న రోడ్ల వివరాలు పొందుపరచాలన్నారు.

KTR review on Siricilla

పట్టణంలోని పలు పనులపైన మంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ నిర్మాణం, గెస్ట్ హౌస్ నిర్మాణం, అడిటోరియాన్ని అభివృద్ది పరచడం వంటి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. టెక్స్ టైల్స్ శాఖ పరిధిలో కార్మికులు, అసాములు, యాజమాన్యాల, టెక్స్ టైల్ పార్కు ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గోన్నారు. టెక్స్ టైల్స్ పరిశ్రమ అభివృద్ది కోసం చేపట్టిన వర్క్‌షెడ్స్‌ వంటి పలు కార్యక్రమాలను సమీక్షించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలు అర్డర్ మేరకు సకాలం పూర్తి చేయాలని కోరారు. షెడ్డుల నిర్మాణం ద్వారా కనీసం 2000 ల మంది కార్మికులను ఒనర్లను చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. దీంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా అసాముల లూములను అప్ గ్రేడ్ చేయడం ద్వారా వారిని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కూలీలు పెరిగిన తర్వతా, సిరిసిల్లాకు వివిధ పథకాల అర్డర్లను ఇస్తున్నందున వారికి అదాయంలో కొంత మార్పు వచ్చిందని కార్మికులు మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ తోపాటు జిల్లా యస్ ఈలు ఇతర ఉన్నతాధికారులున్నారు.

- Advertisement -