మున్సిపల్ కమిషనర్లపై కేటీఆర్ ఆగ్రహం

338
- Advertisement -

మునిపల్ కమీషనర్ల పనితీరుపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తిని, అగ్రహాన్ని వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, అలాంటి వారిపైన వారంలోగా చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో పురపాలికల్లో కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్…పనితీరు మార్చుకునేందుకు ఇదే చివరి అవకాశమని, ప్రభుత్వ అదేశాలను, మున్సిపల్ యాక్ట్ ప్రకారం తమ విధులను నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శిస్తే విధులనుంచి తొలగించడం ఖాయమన్నారు. ఇలా నిర్లక్ష్యం వహిస్తున్న వారి జాబితాను తయారుచేయాలని ఉన్నతాధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు.

తెలంగాణలో గత కొన్ని సంవత్సరాల్లో ఏప్పుడు లేని విధంగా అధిక వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వర్షాలానంతరం అరోగ్య సమస్యలు రాకుండా పారిశుద్య చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు. పాడయిన రోడ్లను, ఇతర మౌళిక వసతులను వేంటనే మరమత్తులు చేపట్టాలన్నారు. పట్టాణాల్లోకి వరదలు వచ్చేందుకు దారితీసిన కారణాలను గుర్తించాలన్నారు. ప్రతి పురపాలికలోని జలవనరులు, చెరువుల గురించిన పూర్తి సమాచారం సేకరించి డిజిటలైజ్ చేయాలన్నారు. ప్రతి చెరువు, నాలల మ్యాపులను సేకరించలన్నారు. వీటిపైన ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించాలన్నారు.

ktr

చట్టవిరుద్దంగా నాలలను కబ్జా చేసిన వారెవరైనా, వదలకుండా కట్టడాలను కూల్చి వేయాలన్నారు. ఈ కూల్చివేతల సందర్భంగా పేదవారిని టార్గెట్ చేయకుండా ముందుగా కమర్షియల్ అవసరాల కోసం కట్టిన వాటిని వేంటనే కూల్చేయాలన్నారు. అర్హులైన పేదవారికి డబుల్ బెడ్ రూంల ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇక నాలలు కుంచించుకుపోయిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా చర్యలు తీసుకుని వాటిని వెడల్పు చేయ్యాలన్నారు. ఇందుకోసం రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో జాయింట్ వర్కింగ్

KTR review

పురపాలికల్లోని శిథిలావస్థలోని భవనాలను వేంటనే గుర్తించి, కూల్చేయాలన్నారు. వర్షాల వల్ల ఏలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. ఒక వేళ ఇలాంటి భవనాల వలన ప్రాణనష్టం జరిగితే మున్సిపల్ కమీషనర్లనే భాద్యులను చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమీమిషనర్లు ఉదయాన్నే విధుల్లో ఉండాలన్నారు. ఇకపై నిరంతరం విడియో కాన్ఫరెన్సు ద్వారా పర్యవేక్షణ చేస్తామని, ఇందుకోసం అన్ని మున్సిపాలీటీల్లో విడియో కాన్ఫరెన్సు సౌకర్యాన్ని వారంలోగా ఏర్పాటు చేయాలని అదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంజి గోపాలు, సిడియంఏ దానకిశోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

kte review on rains

- Advertisement -