మైనింగ్ శాఖపై కేటీఆర్‌ సమీక్ష..

198
KTR Review on Mining Department
- Advertisement -

గనుల శాఖ మీద మంత్రి కెటి రామరావు ఈరోజు మెట్రో రైలు భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలు, వాటి సరఫరా, ఇసుక సరఫరాలో మరింత పారదర్శకత ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖాధికారులు, గనుల శాఖాధికారులు, ఐటి శాఖాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గనుల శాఖలో టెక్నాలజీ వినియోగం పైన ప్రధానంగా చర్చించారు. స్థానిక అవసరాల కోసం ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఇసుక రవాణాను మరింత పారదర్శకంగా ఉంచేందుకు రాష్ర్ట స్ధాయి ఫైయింగ్ స్వాడ్స్ ఏర్పాటు చేస్తుమన్నారు. ఈ స్వాడ్స్లో పోలీస్, రెవెన్యూ, గనుల శాఖ అధికారులతో బృందాలుంటాయన్నారు. రాష్ర్టంలోని ఇసుక రీచుల్లో ఏర్పాటు చేసిన జియో ఫెన్సింగ్ కు జరిగిన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా అని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అధికారిక రీచుల్లో ఇప్పటిదాకా ఏలాంటి ఉల్లంఘనలు లేవని మంత్రికి అధికారులు తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ కు మించి ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల మైనింగ్ ను మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా చేసేందుకు టెక్నాలజీని వాడుకోవాలన్నారు. ఇందుకోసం డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. వీటితోపాటు వాహానాలకు జిపియస్, అర్ యఫ్ ఐడి ట్యాగుల ఏర్పాటు వంటి వాటిని ఉపయోగించాలన్నారు. దీంతోపాటు ఉపగ్రహా అధారిత టెక్నాలజీ వాడుకుని మైనింగ్ రీచుల పర్యవేక్షణకు ఉపయోగించాలన్నారు.

KTR Review on Mining Department

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ రంగంలో అదర్శవంతమైన విధానాలు పాటిస్తున్నామని, దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి సాంకేతిక పరిజ్ఝాన వినియోగంలోనూ దేశానికి అదర్శంగా ఉండాలన్నారు. టెక్నాలజీ సహాకారంతో డంపుల గుర్తింపు, వాహానాల రాకపోకలు, ఒవర్ లోడింగ్ చేసినా గుర్తించేలా టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. ఇందుకోసం ఐటి శాఖ సహాకారం తీసుకోవాలన్నారు. ఇసుక తరలించేందుకు ఉపయోగిస్తున్న వాహానాలు పూర్తి స్ధాయిలో గుర్తించేందుకు రవాణా శాఖ సహాకారం తీసుకోవాలన్నారు.

ఇసుక రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అయా ప్రాంతాల్లో విజిలెన్స్ అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో చెప్పినట్టు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో స్థానిక అవసరాలకు ఇసుక రవాణ చేస్తే తమకు ఏలాంటి అభ్యంతరం లేదని, కానీ వాటి ద్వారా డంపులు తయారు చేస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ, గనుల శాఖాధికారులు ఉమ్మడిగా ముందుకు పోవాలన్నారు.

స్ధానిక అవసరాలకు మీసేవ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. మీసేవ ద్వారా బుక్ చేసుకుంటే వాటికి నీర్ణీత సమయంలోగా వాటికి అనుమతులు ఇస్తామని, ఒకవేల వాటిని తిరస్కరిస్తే, వాటికి కారణాలు కూడా వేంటనే తెలియజేస్తామన్నారు. దీంతో అనుమతులు లేకుండా ఇసుక తరలించాల్సిన అవసరం స్ధానిక ప్రజలకు రాదన్నారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, గనుల శాఖ, టియస్ యండిసి, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్లోన్నారు.

- Advertisement -