నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జియచ్ యంసి రోడ్లపైన మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. వర్షకాలం ముగిసే వరకు రోడ్ల నిర్వహాణపైన ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను అదేశించారు. ఇందుకోసం జియచ్ యంసి ఇంజనీర్లు, ఇతర సంభందింత అధికారులు రోడ్ల నిర్మాణ పనులు, మరమత్తులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. ఈ మరమత్తులకు అవసరం అయిన యంత్రాలను, సామాగ్రిని వేంటనే కోనుగోలు చేయాలన్నారు. నగరంలోని రోడ్లను ప్రత్యేకంగా గ్రిడ్ల వారీగా విభజించి వాటిని ఒక్కో ఇంజనీర్ కు భాద్యత అప్పగించాలన్నారు. అయా గ్రిడ్ల పర్యవేక్షణ, నిర్వహాణకు అయా అధికారే భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.
అదికారులతోపాటు నగర మేయర్, కమీషనర్లు సైతం రోడ్ల మరమత్తులను క్షేత్రస్ధాయిలో పర్యటించి, పర్యవేక్షించాలన్నారు. నగర రోడ్ల నిర్వహాణ ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారం జరగాల్సిన అవసరం ఉన్నదని, ఈ ప్రణాళికను రూపొందించి, అమలు చేసేందుకు జియచ్ యంసి ఇంజరీంగ్ సిబ్బందితో ఒక రోజు వర్క్ షాపు నిర్వహించాలని కోరారు. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అధికారి రోడ్లపైన కనీసం రోజుకు మూడు నాలుగు గంటలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఈ ఎడాది రోడ్ల నిర్వహాణపైన జియచ్ యంసి కొంత చురుగ్గా పనిచేస్తున్నదన్న మంత్రి, గత ఏడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి మరింత జాగ్రతతో పనిచేయాలన్నారు. నగరంలోని HMDA పరిధిలోని రోడ్లపైనా కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అదేశించారు.
నగరంలోని రోడ్ల అభివృద్ది కోరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్ధ (SPV) రూపొందించిన ప్రణాళికపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సంస్ధ తరపున మెదటి దశలో నగరంలోని 300 కీలోమీటర్ల రోడ్ల అభివద్ది కోరకు పరిపాలన పరమైన అనుమతులిస్తూ ఒక జీవోను వేంటనే జారీ చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ను అదేశించారు. దీంతోపాటు రాష్ర్టంలోని పట్టణాలు, ఇతర పురపాలికల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సిడియంఏ శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం ఇప్పటిదాకా 73 శాతం పూర్తయిందని, మిగిలిన పనులు కూడ వివిధ కారణాలతో 7 పట్టణాల్లో పనులు అలస్యం అయినాయని తెలిపారు. ఈ పనులన్నింటిని మరింత వేగంగా పూర్తి చేస్తామని అమె మంత్రికి తెలిపారు. పట్టణాల్లో, జియచ్ యంసి పరిధిలో ఏల్ యిడిలను లైట్ల భిగింపు ప్రక్రియ సైతం వేగంగా పూర్తి చేయాలని, దీపావళి నాటికి అన్ని పట్టణాల్లో ఏల్ ఈ డీ వెలుగులుండాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జియచ్ యసిం కమీషనర్ జనార్ధన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.