హైదరాబాద్ మహానగరానికి సంబంధించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కార్యక్రమం పైన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు మంత్రులు కే తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. వీరితో పాటు ఈ సమావేశానికి పురపాలక శాఖ ఉన్నతాధికారులు మరియు హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు హాజరైయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్నిచోట్ల లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేయడం జరిగింది. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసిన లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని కేటీఆర్ తెలిపారు.