మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు

274
KTR review meeting today
- Advertisement -

జిల్లా కేంద్రాలుగా మారిన పురపాలికల్లో మౌళిక వసతులు కల్పనకు పత్ర్యేకంగా నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. జిల్లా కేంద్రాలైన మున్సిపాలీటీల్లో రోడ్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వంటి వాటి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలీటీల్లో వేసవి కాలంలో తాగునీటి కొరత లేకుండా చూడాల్సిన భాద్యత పూర్తిగా మున్సిపల్ కమీషనర్లదేని, ఇందుకోసం అవసరం అయిన మేరకు నిధులు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.

వేసవి ప్రణాళిక అమలు కోసం స్థానిక సంస్ధల వద్ద ఉన్న నిధులను వాడుకునేందుకు స్వేచ్చ ఇవ్వాలని ఈ మేరకు కమీషనర్లకు అదేశాలు జారీ చేయాలని మున్సిపల్ శాఖ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను అదేశించారు. ఎన్ని ట్యాంకర్లు  వినియోగానికైనా సరే వెనకాడకుండా నీటి సరఫరా చేయాలన్నారు. ఈ సారి వేసవిలో ప్రత్యేకంగా బోరు బావుల తవ్వకానికి నిధులు ఇవ్వబోమన్నారు. ఈ నిధులను పాత బోర్లు రీపేరు చేసేందుకు, లోతు పెంచేందుకు, నీటి సరఫరాకు వాడుతామన్నారు. వచ్చే ఏడాదిలోగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అన్ని పట్టణ కేంద్రాలకు చేరనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

KTR review meeting today

మున్సిపాలీటీల్లో చేపట్టిన బహిరంగ మలమూత్ర విసర్ణ రహిత కార్యక్రమంతోపాటు పలు అభివృద్ది కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన మున్సిపాలీటీలకు ప్రత్యేక నిధులు, ప్రోత్సాకాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 100 శాతం ఇంటికో మరుగుదొడ్డి నిర్మించాలన్నారు. దీంతోపాటు మురికి కాలువల్లోకి మలాన్ని విడుదల చేసే( ఇన్ సానిటరీ టాయిలెట్స్) పూర్తిగా తొలగించాలని, ప్రతి పట్టణంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలీటీల్లో ఆస్థిపన్ను వసూళ్ళలో 100 శాతం లక్ష్యాన్ని అందుకోవడంలో కమీషనర్లు ఆలసత్వం ప్రదర్శించడం పట్ల మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలను చైతన్యవంతం చేస్తూ, పన్నులు వసూళ్లు పెంచాలని, గత ఏడాది కన్నా అధికంగా వసూళ్లు ఉండాలన్నారు. ఈ ఏడాది నుండి అస్థి పన్నుపైన జరిమానాల మాఫీ ఉండదన్నారు. జరిమానా మాఫీ వలన క్రమశిక్షణతో పన్నులు కడుతున్న వారిని నిరుత్సాహ పరిచినట్లు అవుతుందని, పన్నులు అలస్యంగా చెల్లించే వారికి అధిక ప్రయోజనం కలిగేలా ఉన్న నేపథ్యంలో ఈ అస్ధి పన్నుపై జరిమానా రద్దు కార్యక్రమాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నట్లు  తెలిపారు.

KTR review meeting today
ఈ రోజు అసెంబ్లీ హాలులో సంగా రెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల యంఏల్యేలు, మున్సిపల్ కమీషనర్లతో మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా యంపీలు హజరయ్యారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలపైన
మంత్రులు సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మున్సిపాలీటీల్లో అమలవుతున్న యల్ ఈ డీ లైట్ల భిగింపు, ఒడియప్ కార్యక్రమం, ఘన వ్యర్ధాల నిర్వహణ వంటి కార్యక్రమాలను సమీక్షించారు. యంఏల్యేలు తమ మున్సిపాలీటీల్లో ఉన్న సమస్యలను, అవసరాలను మంత్రికి తెలియజేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి పట్టణాల మాస్టర్ ప్లాన్లను సమీక్ష చేయాలని, కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు.

- Advertisement -