చేనేత రంగానికి చేయూతనందిస్తాం…

226
KTR Review Meet On Handloom & Textile Officials
- Advertisement -

రాష్ట్రంలో చేనేత, హస్తకళలకు చేయుత నిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత, హ్యండి కాప్ట్ కమీషనర్ శైలజా రామయ్యర్ ఇతర అధికారులతో కలసి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో గోల్కోండ షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు హ్యాండ్‌ కాప్ట్ కళాకారులకు పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. నిర్మల్ లోని కళాకారులకు ఒక కామన్ ఫేసిలిటి సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ కేంద్రానికి అవసరం అయిన నిధులు, స్థలం కేటాయింపు గురించి నిర్మల్ జిల్లా మంత్రి, స్థానిక శాసన సబ్యులు ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఈ మేరకు తన శాఖ నుంచి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కేంద్ర నిర్మాణం పూర్తయ్యే లోపు సిద్దంగా ఉన్న భవనంలో కామన్ ఫెసిలిటి సెంటర్ ప్రారంభం చేయాలని అధికారులను అదేశించారు. వరంగల్ పట్టణంలో గోల్కోండ షోరూం ఏర్పాటుకు అవసరమైన 1500 గజాల స్థలాన్ని కేటాయించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. మెదక్ లో మరో గోల్కోండ షోరూం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

KTR Review Meet On Handloom & Textile Officials

మెదక్ పట్టణంలో ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా జర్దాసీ, రురీ వర్క్ షాప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వేంటనే చర్యలు తీసుకోవాలని అ జిల్లా కలెక్టర్ ను మంత్రి కోరారు. రంగరెడ్డి జిల్లాలోని ఎల్లమ్మ తాండ లోని ఖాళీగా ఉన్న శిశు సంక్షేమ భవన్‌ని గిరిజన హ్యండి క్రాఫ్ట్ కళాకారులకి అప్పగించాలని రంగరెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు.

హ్యండ్ కాప్స్ లో యువతరానికి శిక్షణ ఇచ్చేలా సకల సౌకర్యాలతో కూడిన శిక్షణ సౌకర్యాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. శాశ్వత భవనం నిర్మాణం జరిగేంత వరకు సిద్దంగా ఉన్న ప్రభుత్వ భవనంలో ఈ శిక్షణ కేంద్ర పనులు ప్రారంభించేలా చూడాలని, ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -