కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణకు చోటు లేకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ నుంచి మురళీదర్ రావు, వెదిరె శ్రీరాం పేర్లు వినిపించినప్పటికీ, మొండి చేయ్యే చూపింది మోడీ ప్రభుత్వం. దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ట్విట్టర్ లో ఎప్పుడూ అందుబాటులో ఉండటంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారని, ట్వీట్ల ద్వారా ఆయన దృష్టి కి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందిస్తారన్న సంగతి తెలిసిందే. క్యాబినెట్ పునర్వవ్యవస్థీకరణలో తెలంగాణకు చోటు లేకపోవడంపై స్పందించాల్సిందిగా కేటీఆర్ సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనిపై కేటీఆర్ రిప్లై ఇస్తూ.. అదొక్కటే కాదు, తెలంగాణకు కేంద్రం చెప్పుకొదగ్గ పని ఏం చేయలేదని, తెలంగాణ నుంచి ఉన్న ఒక్క మంత్రిని కూడా తొలగించారన్నారు. ఇది మంచిది కాదన్నారు.
ఎక్స్ బ్యూరోక్రాట్లను క్యాబినెట్లోకి తీసుకోవడంపై ఎలా చూస్తారు? రాజకీయ పార్టీల్లో అంత మేధావులు లేరని అనుకుంటున్నారా? అని నెటిజన్ ట్వీట్ చేశాడు. కేటీఆర్ బదులు ఇస్తూ.. అనుభవం మరియు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న బ్యూరోక్రాట్లను క్యాబినేట్లోకి తీసుకోవడం మంచి సంకేతమన్నారు.
రైల్వే శాఖకు సురేష్ ప్రభు గుడ్‌బై చెప్పడంతో.. తెలంగాణకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ వస్తుందంటారా? మళ్లీ వెనక్కి వెళ్లే ఛాన్సుందా? అని ఓ నెటిజన్ ట్వీటుకు కేటీఆర్ రిప్లై ఇస్తూ.. మంత్రి పదవిలో ఎవరున్నా.. ఇచ్చినా మాటను నిలుపుకోవడం కేంద్ర భాద్యత , రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఐనా.. బయ్యారం స్టీల్ ప్లాంటైనా అని కేటీఆర్ నెటిజన్లకు బదులిచ్చారు. కాగా,