బీఆర్ఎస్ పార్టీలో పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని… ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పొచ్చు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… కొందరు నేరుగా… లేఖల ద్వారా అధ్యక్షుడికి చెప్తారు అన్నారు. కొన్ని విషయాలు అంతర్గతంగా పార్టీ వేదికలపై మాట్లాడితే మంచిది…ఇది ఎవరికైనా వర్తిస్తుంది అన్నారు. కోవర్టులు ఉంటే సరైన సమయంలో వారి స్వరూపం బయటికి వస్తుంది అన్నారు.
రాష్ట్రంలో యంగ్ ఇండియా పేరుతో వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈడీ ఛార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంటే రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించరని కేటీఆర్ ప్రశ్నించారు.
ఆర్ఆర్ ట్యాక్స్‌పై ప్రధాని మోదీ ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి దిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారని ఒకరు రాహుల్ గాంధీ, మరొకరు ప్రధాని మోదీ అని కేటీఆర్ ఆరోపించారు.
Also Read:మైసూర్ ‘పాక్’..పేరు మార్చారు!

