ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై కేటీఆర్

11
- Advertisement -

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ అగ్నిప్రమాదం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఓట్ ఫర్ నోట్ కేసుకు సంబంధించిన కీలక వాయిస్ రికార్డింగ్‌లు, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని ఆయన ఆరోపిస్తున్న తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భద్రతా ప్రమాణాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించిన కేటీఆర్, అత్యంత కీలకమైన ఆధారాలు ఉన్న చోట ఇలాంటి ఘటన జరగడం యాదృచ్ఛికం కాదని అన్నారు. ఈ అగ్నిప్రమాదంపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆధారాలు నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిజాలు బయటకు రావాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరినీ వదిలిపెట్టకూడదని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -