- Advertisement -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై ఇటీవలె నటి మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు చేస్తున్నారని..వారిపై చర్యలుతీసుకోవాలని కోరారు మీరా చోప్రా.
ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు ట్వీట్ చేశారు మీరా చోప్రా. తనను సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని, యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
మీరా విజ్ఞప్తికి స్పందించారు కేటీఆర్. ఈ విషయాన్ని తాను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని… మీ ఫిర్యాదుపై చట్టాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించానని వెల్లడించారు.
- Advertisement -