- Advertisement -
కాశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను తిరిగి తీసుకువచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.నిన్నటి తీవ్రవాదుల దాడి అనంతరం సుమారు 80 మంది తెలంగాణ వాసులు శ్రీనగర్లో నిన్నటి నుంచి చిక్కుకొని ఉన్నారు అన్నారు.
వాళ్లందరూ క్షేమంగా తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు కేటీఆర్. ఇందుకోసం తగిన సహాయ సహకారాలు తెలంగాణ వాసులకు అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు కేటీఆర్.
Also Read:తెలంగాణ ప్రజలకు భరోసానే కేసీఆర్
- Advertisement -

