మస్కట్‌ నుండి హైదరాబాద్‌కు విమానం…కేటీఆర్ విజ్ఞప్తి

365
ktr
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందేభారత్ మిషన్‌లో భాగంగా భారత్‌కు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మస్కట్ నుండి ప్రత్యేక విమానాన్ని కేరళకు నడుపుతున్నారు.

అయితే మస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తమను హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా సహకరించాలని కోరగా మంత్రి కేటీఆర్ స్పందించారు.

మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాన్ని నడపాల్సిందిగా కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరిని కోరారు కేటీఆర్‌. తెలంగాణ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చిన కేటీఆర్‌…మస్కట్‌ నుంచి విమానాలన్ని కేరళ రాష్ట్రానికే నడుపుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కూడా విమానాలు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -