KTR:ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ

7
- Advertisement -

ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు కేటీఆర్.

భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయమని వెల్లడించారు.చాకలి ఐలమ్మ స్పూర్తిని ప్రపంచానికి చాటే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఐలమ్మ గారి జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు అని గుర్తు చేశారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ గారు ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయం అన్నారు.

Also Read:OG:ఓజీ ఫస్ట్ డే వసూళ్లు

- Advertisement -