KTR:తెలంగాణ తల్లి విగ్రహమా లేదా కాంగ్రెస్‌ తల్లి విగ్రహమా!

3
- Advertisement -

దళితబంధు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక మీ ఉద్దేశమేంటని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తుందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని…కాంగ్రెస్‌ నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్‌ నేతలను కాదని, అంబేద్కర్‌నని చెప్పారు. గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. గురుకుల విద్యార్థులను తాము ఎవరెస్ట్‌ శిఖరాలు ఎక్కిస్తే.. మీరు పాడె ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సచివాలయంలో రేవంత్‌ రెడ్డి ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేదా కాంగ్రెస్‌ తల్లి విగ్రహమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు, నంబర్‌ ప్లేట్లు మారాలా అని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు. నాలుగేండ్ల తర్వాత ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలో.. ఎక్కడ రాజీవ్‌ గాంధీ విగ్రహం ఉండాలో అక్కడికి పంపిస్తామన్నారు.

Also Read:ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు: కోమటిరెడ్డి

- Advertisement -