తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!

7
- Advertisement -

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ…. ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు అన్నారు.

నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిల్చిన మహా మనిషి కాళోజీ, పలు భాషల్లో రచనలు చేసి ప్రజల హక్కుల కోసం పోరాడాడు…తెలంగాణ వాడుక భాషలో రచనలను ప్రాచుర్యంలోకి తెచ్చి.. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటాడు అన్నారు.

వారి సేవలను గౌరవిస్తూ.. కేసీఆర్ గారి ప్రభుత్వం కాళోజీ గారి జయంతిని (సెప్టెంబర్ 9) తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది, కాళోజీ అవార్డును నెలకొల్పింది. వరంగల్‌లోని వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు గారి పేరు పెట్టడమే కాకుండా.. హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని చేపట్టింది అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా.. వారి రచనలను తెలంగాణ యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశిస్తూ.. కాళోజీ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అన్నారు.

Also Read:మిరాయ్‌..గూస్‌బంప్స్ గ్యారెంటీ!

- Advertisement -