తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అన్నారు కేటీఆర్. తెలంగాణ భావజాలవ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్…తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారికి అనునిత్యం అండగా ఉంటూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాక పోరాడిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉంది.. దీనికి తెలంగాణవాదులందరూ కంకణబద్ధులై ఉంటారని ఆశిస్తూ…జోహార్ జయశంకర్ సార్!
అని ఎక్స్ వేదికగా తెలిపారు.
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ ముద్దుబిడ్డ, సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడు జయశంకర్ సార్..భవిష్యత్ తరాలకు జయశంకర్ గారి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో వారి జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చిండు సీఎంగా కేసీఆర్ అన్నారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ, భూపాలపల్లి జిల్లాలకు వారి పేరు పెట్టడంతో పాటు, ఏటా ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా నిర్ణయించారు.జయశంకర్ సార్.. ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారి మార్గంలో పయనించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు.
Also Read:సబితా ఇంద్రారెడ్డిపై దౌర్జన్యమా?:హరీష్

