ఓ మై ఫ్రెండ్‌…స్నేహితులతో కేటీఆర్

677
ktr

ఓ వైపు క్షేత్రస్ధాయిలో టీఆర్ఎస్‌ బలోపేతంపై దృష్టిసారిస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ముందుంటున్నారు కేటీఆర్. అంతేగాదు నెటిజన్ల సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తున్న కేటీఆర్ తాజాగా తన స్నేహితులతో ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

చాలా ఏళ్ల క్రితం.. 1999లో నా స్నేహితుడు మహేశ్ వోదెలతో’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను ట్వీట్ చేశారు. అలాగే గేదెల వెంకట సూర్య కిరణ్, ప్రదీప్ రెడ్డి అనే మిత్రులతో కలసి ఉన్న మరో ఫొటోనూ ఆయన పోస్ట్ చేశారు.

https://twitter.com/KTRTRS/status/1164915975516332034

దీంతో పాటు ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకుంటున్న ఫోటోను షేర్ చేసిన కేటీఆర్ ఇందులో హిమాన్షు కూడా ఉన్నారని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

https://twitter.com/KTRTRS/status/1164923272745500672