స్కోచ్ అవార్డు అందుకున్న రామ్….

227
KTR to receive Skoch Challenger of the year award
- Advertisement -

స్కోచ్ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. 49వ స్కోచ్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐటీ  స్టాల్స్ ను  సందర్శించారు.. ఐటీ మంత్రిగా రాష్టంలో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు.  ఆ కార్యక్రమాలే ఐటీ మినిస్టర్ అఫ్ ది ఇయర్ గా ఎంపిక చేశాయన్నారు.

KTR to receive Skoch Challenger of the year award

కేటీఆర్ కు అవార్డు ప్రకటించిన సందర్భంగా.. స్కోచ్ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చార్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ను పలు సందర్భాల్లో దగ్గరగా గమనించాం. పలు అంశాలపై ఆయన సృజనాత్మకంగా స్పందించిన తీరు ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సఫలంచేసే రీతిలో మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. ఐటీ రంగ విశేష వృద్ధికోసం ఆయన పనిచేస్తున్న తీరు నూతన భారతంకోసం కొత్త రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా ఉందని ప్రశంసించారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిశితంగా గమనించడంతోపాటు పలువురు అధ్యయనవేత్తలతో కూడిన బృందం వాటిని విశ్లేషించడం, భాగస్వామ్యం పక్షాలతో చర్చించడం, స్కోచ్‌కు అంతర్గత బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. స్కోచ్ సంస్థ 2003 నుంచి స్వతంత్రంగా ఆయా రాష్ర్టాలను అధ్యయనం చేస్తోంది.

KTR to receive Skoch Challenger of the year award

- Advertisement -