రాహుల్‌ జీ..ఈ విధ్వంసాన్ని చూడండి: కేటీఆర్

12
- Advertisement -

ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ..మీరు ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్నందున, దయచేసి కింది ప్రాంతాలను సందర్శించండి.

()లగచర్ల గ్రామం

()సుంకిశాల

()హైడ్రా కూల్చివేసిన ప్రదేశాలు

()మూసి కూల్చివేత ప్రదేశం

()హెచ్‌సీయూలోని కంచ గచ్చిబౌలి

()గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌తో మరణించిన 100 గురుకుల విద్యార్థుల కుటుంబాల్లో ఎవరినైనా

()ఆత్మహత్య చేసుకున్న 500 పైగా రైతుల కుటుంబాల్లో ఎవరినైనా

()కుప్పకూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్

Also Read:హుస్సేన్ షా కుటుంబానికి రూ.5లక్షల సాయం: షిండే

()ప్రసిద్ధమైన ఫోర్త్ సిటీ – ఫోర్ బ్రదర్ సిటీ

()మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసిన అశోక్‌నగర్

మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంపై మోపిన విధ్వంసాన్ని మీరు ‘అద్భుతంగా’ విన్న ఆనందాన్ని పొందాలని ఆశిస్తున్నాను అని ప్రశ్నించారు.

 

- Advertisement -