తెలంగాణ కాంగ్రెస్‌పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారు..ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో యువత ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.
యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చినందుకు, టీఎస్‌పీఎస్సీని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు చెప్పేందుకు యువత ఎదురుచూస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గ్యారంటీలను నెరవేర్చిన మిమ్మల్ని యువతను కలిసేందుకు హైదరాబాద్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి సంబంధించిన ట్వీట్‌ను ఇందులో ప్రస్తావించారు.
Rahul Ji,
Youth in Ashok Nagar are waiting to thank you for delivering on “2 lakh Jobs in 1 year”
Also thank you for the 5 lakh “Yuva Vikasam” assistance & revamp of TSPSC
Welcome back to Hyderabad to meet with the youngsters since your guarantee is done https://t.co/LJbagV2Kka
— KTR (@KTRBRS) October 9, 2024
Also Read:ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘మునగ లడ్డూ’!