ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి.. కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి అని విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు.. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డా అని పేర్కొన్నారు.
ప్రధానిగా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పాలని..దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకుండా, దశాబ్దాకాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి అని సూచించారు.
పిరమైన ప్రధాని @narendramodi గారు..
మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో..
యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు..
———————————–దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!
దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!!ప్రధానిగా పదేళ్లు…
— KTR (@KTRBRS) May 7, 2024