ఈ మద్య తెలంగాణ పై కమలనాథులకు ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. తరచూ రాష్ట్రంపై కపట ప్రేమను కనబరుస్తున్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి.. రాష్ట్రంలో పర్యటనలు మాత్రం దర్జాగా చేస్తున్నారు. మొదటి నుంచి తెలంగాణ విషయంలో చిన్నచూపు చూస్తూ వచ్చిన ప్రధాని మోడి. ఈ మద్య తెలంగాణలో తరచూ పర్యటిస్తున్నారు. మొన్న మహబూబ్ నగర్ పాలమూరులో పర్యటించిన మోడి.. నేడు నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నామని ” శంకుస్థాపనలే కదా చేసేస్తే పోలా.. ” అన్న రీతిలో రాష్ట్రనికి వచ్చి పలు ప్రాజెక్ట్ లకు శంకుస్థపనలు చేసే మళ్ళీ డిల్లీ వెళ్లిపోతున్నారు.
మరి ప్రాజెక్ట్ పనులు మునుకు కదులుతాయా ? లేదా అంటే నో కామెంట్స్ అన్న రీతిలోనే వ్యవహరిస్తారు కేంద్ర పెద్దలు. ఏళ్ళు గడుస్తున్న పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేయడం లేదు గాని కొత్త వాటికి శ్రీకారం చూడుతూ వాటిని పూర్తి చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్ట్.. వంటి వాటిని అసలు పట్టించుకున్న దాఖలలే లేవు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్ళు గడుస్తున్న ఇంతవరకు ఆ మూడు ప్రాజెక్ట్ లు ప్రాణం పోసుకున్నది లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడిని ప్రశ్నిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, పాలమూరు ప్రాజెక్ట్ హామీల సంగతేంటి అని ప్రశ్నించారు. గుజరాత్ ను గుండెల్లో పెట్టుకొని, తెలంగాణ విషయంలో మాత్రం హామీలు నెరవేర్చకుండా గుండెల్లో గునపాలు గుచ్చారని విమర్శించారు కేటిఆర్. నార్త్ లో తరచూ పర్యటించే మోడి.. ఎప్పుడో చుట్టం చూపుగా తెలంగాణకు వస్తూ.. తెలంగాణ పట్ల ఎంత పక్షపాతం గా వ్యవహరిస్తూ వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడేమో రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తూ.. తెలంగాణపై కపట ప్రేమను కనబరుస్తున్నారు. తెలంగాణ పట్ల విభజన హామీలను ఇంతవరకు నెరవేర్చక పొగా.. నిధుల విడుదలలో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల వేల నానా హడావిడి చేస్తున్నారు కేంద్ర బీజేపీ పెద్దలు. కమలనాథులు ఆడే కపట నాటకాలు తెలంగాణ ప్రజానీకానికి తెలియనిది కాదు. బీజేపీకి సరైన టైమ్ లో ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యం.
Also Read:Venkatesh:’సైంధవ్’ కీ అప్‌డేట్