KTR: 4 నెలలైనా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై చర్యలేవి

7
- Advertisement -

రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్‌పై మరోసారి ట్విట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీ అవినీతిలో కూరుకుపోయిందని స్పీచ్‌లు ఇస్తారు. కానీ మీ క్యాబినెట్‌లోని మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ గురించి గానీ, కాంగ్రెస్‌ అవినీతి గురించి గానీ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ గురించి ప్రధాని మోడీ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. వారు మీతో ఏకీభవించట్లేదా లేకా.. మీ విమర్శ కేవలం ఎలక్షన్‌ స్టంటా? అంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

 

Also Read:న్యూస్ అప్‌డేట్స్ టుడే..

- Advertisement -