KTR:నీట్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ జ‌రపండి..

16
- Advertisement -

నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్… లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్‌లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనితో తోడు ఈ సారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్‌లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటమన్నది సాధ్యమయ్యే పనికాదన్నారు. బీఆర్ఎస్ తర‌పున పలు పశ్నలతో పాటు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచారు కేటీఆర్.

1) గత 5 ఏళ్లలో తెలంగాణ‌ నుంచి ఏ విద్యార్థి కూడా నీట్‌లో టాప్ 5 ర్యాకింగ్‌లో లేరు. దీనికి కచ్చితంగా నీట్ ఎగ్జామ్‌లో జరుగుతున్న అక్రమాలే కారణమని మేము నమ్ముతున్నాం.

2) గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రామాణిక పద్దతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతుంది. కానీ 1500 మంది విద్యార్థుల గ్రూప్‌కు మాత్రమే మేలు చేసే విధంగా గ్రేస్ మార్కులు కలిపారు. అది సరైన విధానం కాదు.

3) ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్‌పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నీట్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read:రామోజీరావు..ప్రస్థానం ఇదే

https://x.com/KTRBRS/status/1799351003008901380?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1799351003008901380%7Ctwgr%5E9e3826141064b7323c70363772d98b6cd5f80562%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fbrs-working-president-ktr-responds-on-neet-exam-marks-1614476

- Advertisement -