చేతకాని హామీలు ఇచ్చేదెందుకు.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకు? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని నిలదీశారు. బీఆర్ఎస్ నినాదం, విధానం జై కిసాన్ అని, కాంగ్రెస్ పాలసీ ఎప్పటికీ నై కిసానే అని మండిపడ్డారు.
నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు
నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట ?దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ?
కాంగ్రెస్ పాలనలో.. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా ?
రేవంత్ ఏడాది ఏలికలో…తెలంగాణ రైతుకు గోస తప్ప..… pic.twitter.com/DSJjHCMWXv
— KTR (@KTRBRS) November 11, 2024
Also Read:మైటా వార్షికోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు