KTR:కాంగ్రెస్ పాలనలో ఆగమైన నేతన్న

21
- Advertisement -

కపట కాంగ్రెస్ పాలనలో.. కడుపునింపే అన్నదాత ఆగమైండు..చేనేత కార్మికుడు చితికిపోతుండన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ట్విట్టర్(ఎక్స్) ద్వారా స్పందించిన కేటీఆర్…ప్రభుత్వ వైఫల్యం వల్ల..పాలకుడి నిర్వాకం వల్ల..ప్రతి నేతన్న నడిరోడ్డు మీద పడ్డాడన్నారు. నాడు తెలంగాణ అవకాశాల గని,చేనేత కార్మికుడికి చేతినిండా పని కానీ నేడు చేతకాని కాంగ్రెస్ పాలన.. కార్మికుల పాలిట శనిగా మారిందన్నారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లకు అడ్రస్ లేదు..ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు మోక్షం లేదు..అసమర్థ పాలనలో దిక్కుతోచని నేతన్నకు….చేసేందుకు పనిలేదు.. తినేందుకు తిండి లేదు అన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన.. సబ్సిడీ పథకాన్ని రాగానే సమాధి చేశారు.చేనేత మిత్ర పథకానికి నిలువునా పాతరేశారన్నారు. ఇలా ఇంకెంతకాలం అన్యాయాల జాతర చేస్తారు..? అని ప్రశ్నించారు.

Also Read:KTR:రైతుల బాధ కనిపించడంలేదా?

- Advertisement -