KTR: దళిత మహిళపై ఇంత దాష్టీకమా?

14
- Advertisement -

దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ ద్వారా ప్రశ్నించిన కేటీఆర్.. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? అని ప్రశ్నించారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?,మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?,నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! అన్నారు.

ఇంత కర్కశత్వమా… సిగ్గు సిగ్గు..!,కొడుకు ముందే చిత్ర హింసలా? అని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా?,ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో…మహిళలంటే ఇంత చిన్నచూపా..! అన్నారు. ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు..! జరుగుతున్నాయన్నారు.యథా రాజా తథా ప్రజా అన్నట్లు,ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే..పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు అన్నారు.

ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారు…ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అని, వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి అన్నారు. షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచం అని,బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,బాధిత మహిళలకు న్యాయం చేయాలన్నారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు.

Also Read:శ్రావణమాసం విశిష్టత..విశిష్ట పండగలివే

- Advertisement -