బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో చేసింది చెప్పలేకే ఓటమి పాలయ్యామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్తగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన కేటీఆర్… పదేండ్లలో ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. అయినప్పటికీ నిరుద్యోగులకు, యువతకు దూరం అయ్యామని తెలిపారు.
ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతకంటే గొప్పగా ఉపాధి కల్పన జరగలేదని…బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. చదువుకున్న యువత సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారానికి ఆకర్షితులై బీఆర్ఎస్‌కు దూరమయ్యారన్నారు.
ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం రాదు కాబట్టి ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించాం అని తెలిపారు కేటీఆర్. ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించాం…కేసీఆర్ నాయకత్వంలో 33 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. విద్యావ్యాప్తి, ఉపాధి కల్పనకు, ప్రయివేటు రంగంలో పెట్టబడులకు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కృషి చేశామని…పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కే ఓటేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..