కంటివెలుగు కతమయింది..తెలంగాణ భవిష్యత్ చీకటయింది

2
- Advertisement -

కంటివెలుగు కతమయింది..ఇంటివెలుగు మాయమయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవిష్యత్ చీకటయింది అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నాడు కేసీఆర్ పాలనలో పదేళ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణాలో నేడు 11 నెలల కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకున్నాయి అన్నారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల చప్పుళ్లతో అల్లాడుతున్నాయి..జేబునిండా డబ్బులతో రుబాబ్ గా బతికిన రైతన్నను నేడు చేతికి బేడీలు వేసి ఠాణాల చుట్టూ తిప్పుతున్నారు అన్నారు.

నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు వెన్నెముకగా నిలిస్తే .. నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరులో రైతన్న ఆగమైతుండు అన్నారు. నాడు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు .. నేడు ఘడియ ఘడియ గండంగా కంటిమీద కునుకులేకుండా బతుకులీడుస్తున్నాయి అన్నారు.

11 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోతున్నారు…రైతులు రైతుబంధు కోల్పోయారు రుణమాఫీ కోల్పోయారు సాగునీళ్లు కోల్పోయారు 24 గంటల ఉచిత కరంటు కోల్పోయారు అన్నారు.

 

Also Read:అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయండి: షర్మిల

- Advertisement -