పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైపోతుందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో తెలంగాణ గరమైతున్నదని మండిపడ్డారు. తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు. ‘హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల నిరసన. ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది
కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది
మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది
పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది
కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ… pic.twitter.com/liaE7n0Jvb
— KTR (@KTRBRS) November 12, 2024
Also Read:ధూం ధాం…ఎక్స్ లెంట్ రెస్పాన్స్