KTR: మహిళా జర్నలిస్టులకే రక్షణ కరువు?

2
- Advertisement -

ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్‌ రెడ్డి అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు.

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. వెంటనే కాంగ్రెస్ గూండాలపై కేసులు నమోదు చేయాని, వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు.

Also Read:తిరుమలలో నీటి కొరత

- Advertisement -