రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు. నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు అన్నారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా..? అంటూ కాంగ్రెస్ సర్కార్‌ను కేటీఆర్ కడిగి పారేశారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..? 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు..? చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..? అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..? ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన అన్నారు కేటీఆర్.
ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా
అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడు
తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… pic.twitter.com/8IW6Qpp29g
— KTR (@KTRBRS) September 20, 2024
Also Read:ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఫైర్